|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 04:11 PM
యువ సామ్రాట్ నాగా చైతన్య ఇటీవలే 'తాండాల్' తో భారీ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం నటుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్టు NC24 కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి మేకర్స్ 'వృష కర్మ' అనే టైటిల్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు గత కొన్ని రోజులుగా నాగ చైతన్య తన 25వ సినిమా కోసం మజిలీ డైరెక్టర్ శివ నిర్వణ తో జత కడుతున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News