|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:55 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. 'NTRNeel' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఇక ఇందులో రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న రుక్కిణి వసంత్ తాజాగా షూటింగ్ సెట్‌లో జాయిన్ అయినట్లు తెలిపారు. ఈ మేరకు 'నటి రుక్మిణి వసంత్ NTRNeel షూటింగ్‌లో చేరారు.. NTRNeel భారతీయ సినిమా తీరాలను కదిలిస్తుంది' అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన పోస్టర్ ప్రజెంట్ వైరల్ అవుతోంది. అయితే.. ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కానీ.. దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
Latest News