|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:51 PM
ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' మూవీ టీజర్ లీక్ విషయంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల 16న టీజర్ అధికారికంగా విడుదలైనప్పటికీ, అంతకుముందే సోషల్ మీడియాలో టీజర్‌కు సంబంధించిన క్లిప్స్ వైరల్ అయ్యాయి. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సినిమా డబ్బింగ్ ఇంఛార్జ్ వసంత్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు.ఇక, ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజాసాబ్' చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో ఫాంటసీ అంశాలతో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా ముందుగానే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమైందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ఒక సందర్భంలో తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Latest News