|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:02 PM
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ దర్శకత్వంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖితా యలమాంచాలి, అడ్డాల పృధివి రాజ్, కల్పలత మరియు ఇతరలు ప్రధాన పాత్రలలో "యుఫోరియా" అనే కొత్త యూత్ ఫుల్ సోషల్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సమకాలీన దురాచారాలపై ఉద్వేగభరితమైన మరియు వేగవంతమైన టేకింగ్, మరియు ఇది ప్రకటించినప్పటి నుండి ఉత్సుకతను పెంచింది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని రామ రామ అనే టైటిల్ తో జూన్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని గ్రీన్ హిల్స్ రోడ్ లో రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్ లో సాయంత్రం 5:30 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రముఖ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర సాంకేతిక బృందంలో ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీని, ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు మరియు యువ సంగీత సంచలనం కాల భైరవ సంగీతాన్ని అందించారు. రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News