|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:25 PM
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'తమ్ముడు'. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి లయ వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా, ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను లయ పూర్తి చేసినట్లు చిత్రబృందం గురువారం ప్రకటించింది. ఈ చిత్రం జులై 4న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాలో లయ 'ఝాన్సీ కిరణ్మయి' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. "డైనమిక్ పాత్ర అయిన ఝాన్సీకిరణ్మయి వెనుక ఉన్న శక్తివంతమైన వాయిస్. నటి లయ తమ్ముడు చిత్రంలో తన రీఎంట్రీ పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. జులై 4న థియేటర్లలో. #ThammuduOnJuly4th" అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
Latest News