|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:13 PM
తెలుగు ప్రేక్షకులను మలయాళ సినిమాలకు మరింత దగ్గర చేసింది ఓటీటీనే అని చెప్పాలి. ఓటీటీలలో వచ్చే మలయాళ సినిమాలు మంచి మార్కులు సంపాదించుకోవడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. అలా ఇప్పుడు మలయాళం నుంచి మరో సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'కొల్లా' .. 'కొల్లా' అంటే 'దోపిడీ' అని అర్థం. 'కొల్లా' సినిమా మలయాళంలో 2023లో జూన్ 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆ తరువాత మలయాళంలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఈటీవీ విన్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగులోను అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో రజీషా విజయన్ - ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ ఇద్దరి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఇద్దరికీ కూడా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. బ్యాంక్ దోపిడీ చేయడం తప్ప మరో మార్గం లేదని భావిస్తారు. అందుకోసం వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటారు? అనేది కథ.
Latest News