|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:15 PM
టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటుంది. అరోమలై(Aromalai), బాంబ్(Bomb) వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక సంచలన వ్యాఖ్యలు చేసింది. '' మా అమ్మనాన్న ఇండస్ట్రీకి చెందిన వారు కాబట్టి ఒక్క సినిమా చేస్తే చాలు ఇక ఆ తర్వాత వరస అవకాశాలు వస్తాయని అనుకున్నాను. కానీ ఆ తర్వాతే నాకు అర్థం అయింది అలా వర్కౌట్ అవదని. ఫస్ట్ సినిమా నెపొటిజం వల్లే వచ్చింది.రాజశేఖర్ కూతురు కదా మంచిగా నటిస్తానని పిలుస్తారనుకున్నా. కానీ అలా జరగలేదు. మా అమ్మ దర్శకనిర్మాతలకు ఫోన్ చేసి నా కూతురిని మీ చిత్రంలో తీసుకోండి అని చెప్పలేరు. మన కష్టంపైనే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. స్టార్ కిడ్స్‌కు ఒక యాక్సెస్ ఉంటుంది. అదేంటంటే.. ఇండస్ట్రీలో ఎవరో తెలియని అమ్మాయి డైరెక్ట్‌గా డైరెక్టర్లను వెళ్లి కలవలేరు. కానీ అలాంటి అవకాశం నాకు ఉంది. సినిమాల్లో అవకాశం రావాలంటే మాత్రం నా టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక సినిమాలో బెస్ట్ ఇచ్చావంటే ఆ పాత్ర పట్టుకొని ఇంకో అవకాశం వస్తుంది. అంతే తప్ప స్టార్ కిడ్ అన్నంత మాత్రాన ప్రతి సినిమాలో చాన్స్ రాదు. అలా నాకూడా నా మొదటి మూవీ వల్లనే తర్వాత అవకాశాలు వచ్చాయి. నా జీవితానికి నేనే హీరో'' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News