![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 05:28 PM
R.S.ప్రసన్న దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ కామెడీ-డ్రామా 'సీతారే జమీన్ పార్' తో ప్రేక్షకులను అలరించడానికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రం స్పానిష్ ఫిల్మ్ ఛాంపియన్స్ యొక్క అధికారిక అనుసరణ. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో 120 కోట్ల డీల్ ని ఆఫర్ చేసినట్లు లేటెస్ట్ టాక్. ఈ ఆఫర్ ని అమిర్ ఖాన్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో జెనీలియా దేశ్‌ముఖ్ మరియు దర్శీల్ సఫారీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 2007 క్లాసిక్ తారే జమీన్ పార్ యొక్క సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది.
Latest News