![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 05:18 PM
అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రలలో నటించిన 'షైతాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్ చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందించబడింది కానీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్టింగ్ ముంబైలో మొదలైంది. అజయ్ దేవగన్ కంపెనీలో రచయితల బృందం దీని కోసం పని చేయడం ప్రారంభించింది. అయితే తాజా సమాచారం ఏమిటంటే, ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్తుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సీక్వెల్‌కి వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News