|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 03:55 PM
యువ నటుడు సిద్ధార్ తన తదుపరి చిత్రాన్ని శ్రీ గణేష్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ '3 బిహెచ్కె' అనే టైటిల్ ని లాక్ చేసారు. మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ భారీ స్పందనను అందుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ డబ్బింగ్ ని నటుడు సిద్ధార్థ పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ డబ్బింగ్ స్టూడియో నుండి ఒక స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయానీ, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్రా మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రఖ్యాత గాయకుడు బొంబాయి జయశ్రీ కుమారుడు అమృత్ రామ్నాథ్ సంగీత దర్శకుడిగా ఉండగా, దినేష్ కృష్ణన్ బి మరియు జిథిన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. గణేష్ శివ ఎడిటింగ్ ని చేస్తున్నారు.
Latest News