![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:28 PM
హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. పవన్ కళ్యాణ్ యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా హోల్డ్ లో ఉంది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని ఈరోజు నుండి తిరిగి ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో మేకర్స్ ప్రధాన నటులను కలిగి ఉన్న కీ సీక్వెన్స్‌లను చిత్రీకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు లేటెస్ట్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు దశరధ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News