![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 10:38 AM
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె వైట్ డ్రెస్‌లో అందాన్ని ఆరబోస్తూ స్టన్నింగ్ లుక్‌లో మెరిసిపోతోంది. ఆమె గ్లామర్‌కు నెట్లో అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఫ్యాషన్, స్టైల్ పరంగా ఆమె ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.కెరీర్ ప్రారంభంలో కాస్త తక్కువ సినిమా చాన్సులు వచ్చినప్పటికీ.. ఈ బ్యూటీ నెటిజన్ల మనసు దోచుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో నటించి మెప్పించింది. వీటితో పాటుగా విశ్వక్ సేన్, వరుణ్, దుల్కర్ సల్మాన్ కథానాయకుల సరసన కూడా నటించింది. మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవం. ముఖ్యంగా మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.