![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:28 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తాజాగా అఖిల్ అక్కినేని రిసెప్షన్ లు కుటుంబ సమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాడు. మహేష్ తో పాటు నమ్రత, సితార కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అఖిల్- జైనబ్ వివాహం జూన్ 6 న జరిగిన విషయం తెల్సిందే. ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా ఈ వివాహం జరిగింది. ఇక జూన్8 న వవీరి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఎంతో సింపుల్ గా కనిపించినా.. అందరి చూపు మహేష్ పైనే ఉంది అని చెప్పొచ్చు. ఇక మహేష్ ధరించిన టీ షర్ట్ ను చూసి ముచ్చటపడిన అభిమానులు.. అలాంటి టీ షర్ట్ నే కొనడానికి, దాని రేటు ఎంత అని గూగుల్ చేసి ఖంగు తిన్నారు. ఆలివ్ గ్రీన్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ తో ఉన్న టీ షర్ట్ హెర్మ్స్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ తయారుచేసింది. దీని విలువ అక్షరాలా రూ. 1.51 లక్షలు. నమ్మడానికి వీలు లేకున్నా అది నిజం. అది సూపర్ స్టార్ రేంజ్. మొదటి నుంచి మహేష్ బయటకు చాలా సింపుల్ గా వచ్చినా చాలా కాస్ట్లీ దుస్తులు ధరిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ లు ఇస్తూనే ఉంటాడు. ఇక టీ షర్ట్ ధర లక్షల్లో ఉండడంతో నెటిజన్స్.. ఆమ్మో ఒక్క టీ షర్ట్ ధర అంతనా అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
Latest News