![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:57 PM
టాలీవుడ్ నటుడు నితిన్ దర్శకుడు శ్రీరామ్ వేణులతో ఒక ఎంటర్టైనర్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'తమ్ముడు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ తమ్ముడు సినిమాతో టాలీవుడ్లో లీడ్ రోల్లో నటిస్తోంది. జూలై 4, 2025న ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయి ప్రమోషన్లు మేకర్స్ ప్రారంభించారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకి సంబందించిన వీడియోని జూన్ 11న సాయంత్రం 5 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సీనియర్ నటి లయా ఈ చిత్రంలో నితిన్ సోదరిగా నటిస్తున్నారు, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తుంది. అజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. తమ్ముడు సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్, మ్యూజిక్ కంపోజర్ బి అజనీష్ లోక్నాథ్ మరియు ఎడిటర్ ప్రవీణ్ పూడితో సహా ప్రతిభావంతులైన సాంకేతిక బృందాన్ని కలిగి ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
Latest News