|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:21 AM
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సతీమణి కిరణ్‌రావు తెరకెక్కించిన ‘లాపతా లేడిస్’ పాజిటివ్ టాక్‌ను అందుకున్నప్పటికీ థియేటర్లలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకోలేకపోయింది. దీని గురించి ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ సినిమాలకు ప్రశంసల కంటే బాక్సాఫీసు నంబర్లే ముఖ్యం. వాటి ఆధారంగానే విజయాన్ని నిర్ణయిస్తారు. లాపతా లేడిస్ మూవీని 8వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయకపోయి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేది. ఈ సినిమా ప్రజల్లోకి వెళ్లడం ఆలస్యమైంది’ అని అన్నారు.
Latest News