|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:34 PM
తరుణ్ మన్సుఖానీ దర్శకత్వంలో రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలలో నటించిన 'హౌస్‌ఫుల్ 5' చిత్రం జూన్ 6, 2025న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకుంటుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ఇండియా వైడ్ గా 24.35 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, జక్క్యూలినే ఫెర్నాండేజ్, కృతి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని సాజిద్ నాడియాద్వాలా యొక్క నాడియాద్వాలా గ్రాండ్స్లోన్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
Latest News