|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:13 PM
నటుడు రానా తన తాజా వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు 2’ ప్రమోషన్ల సందర్భంగా నెపోటిజంపై మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చే వారికి మొదటి అవకాశాలు, ప్రవేశం సులభంగా లభిస్తాయని ఆయన చెప్పారు. అయితే, అవకాశాలను నిలబెట్టుకోవడం మాత్రం పూర్తిగా వ్యక్తిగత ప్రతిభపైనే ఆధారపడి ఉంటుందని రానా పేర్కొన్నారు. ఇక 'రానా నాయుడు 2' సిరీస్ ఈ నెల 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
Latest News