![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:04 PM
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ ఇప్పటికే పలు సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ కీలక పాత్రలను పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతను 'సోలో బాయ్' పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను సెవెన్ హిల్స్ సతీశ్ నిర్మిస్తున్నారు. పి. నవీన్ కుమార్ దీనికి దర్శకుడు. ఆట ఫేమ్ సందీప్ ఈ మూవీకి కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. 'సోలో బాయ్' మూవీ నిర్మాత సతీశ్ మాట్లాడుతూ, 'కొవిడ్ టైంలో నేను 'బట్టల రామస్వామి బయోపిక్' అనే సినిమా తీశాను. అప్పుడున్న పరిస్థితుల్లో దానిని ఓటిటి ద్వారా ప్రజలకు చేరవేశాం. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ కథ నచ్చి మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా ఇది. మా హీరో గౌతమ్ కృష్ణ 'సోలో బాయ్'గా మీ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీని జూలై 4న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కనీసం పది నిమిషాలు దీని గురించి తప్పకుండా ఆలోచిస్తారు' అని అన్నారు.హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, 'గతంలో 'ఆకాశవీధిలో' సినిమాలో నటించినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరి కొన్ని చిత్రాలలో నటించాను. ఇప్పుడీ 'సోలో బాయ్'తో నాకు సక్సెస్ కూడా దక్కుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్ కే మామ, భద్రం, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.అయితే జూలై 4వ తేదీని ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కావడానికి సిద్థంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'కింగ్ డమ్' మూవీ జూలై 4నే వస్తోంది. అలానే నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'తమ్ముడు' మూవీనీ మే జూలై 4న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. అలానే సిద్థార్థ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం '3 బి.హిచ్.కె.' సైతం అదే తారీఖున విడుదల కానుంది. సో... సినిమా పేరుకు 'సోలో బాయ్' అయినా... గట్టి కాంపిటీషన్ మధ్యే గౌతమ్ కృష్ణ సినిమా రాబోతోంది.
Latest News