|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:33 AM
బాలీవుడ్ నటుడు డినో మోరియోకు ED సమన్లు జారీ చేసింది. రూ.65 కోట్ల మిథి నది పూడికతీత కుంభకోణం కేసులో వచ్చేవారం విచారణకు రావాలని ఆదేశించింది. పూడికతీత పేరుతో బిల్లులు సమర్పించి డబ్బు దోచుకున్నారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఇప్పటికే రెండుసార్లు ఆయనను ప్రశ్నించింది.
Latest News