![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:51 AM
సంచలన చిత్ర నిర్మాత వెట్రిమారన్‌తో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వాడి వాసల్' అనే టైటిల్ ని లాక్ చేసారు. చాలా జాప్యాలు జరగడంతో వాడి వాసల్ ప్రాజెక్ట్ ని ఆపివేసినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చిత్ర నిర్మాత తాను అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రస్తుతం లండన్‌లో యానిమేట్రానిక్స్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ వర్క్ పూర్తి అయ్యిన తర్వాత త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుంది అని అన్నారు. ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాకి జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Latest News