![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 07:42 AM
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ తన విలక్షణమైన కథాంశం మరియు హిట్ చిత్రాలకు పేరుగాంచాడు. ప్రస్తుతం "యుఫోరియా" అనే కొత్త యూత్ ఫుల్ సోషల్ డ్రామాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖితా యలమాంచాలి, అడ్డాల పృధివి రాజ్, కల్పలత మరియు ఇతరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సమకాలీన దురాచారాలపై ఉద్వేగభరితమైన మరియు వేగవంతమైన టేకింగ్ మరియు ఇది ప్రకటించినప్పటి నుండి ఉత్సుకతను పెంచింది. ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని మే 24న ఫ్లై హై అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో సాయంత్రం 6 గంటల నుండి స్పెషల్ పెర్ఫార్మన్స్ తో ఈ సాంగ్ లాంచ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రఖ్యాత తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, భూమికా చావ్లా ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించన్నారు. రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చిత్ర సాంకేతిక బృందంలో ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీని, ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు మరియు యువ సంగీత సంచలనం కాల భైరవ సంగీతాన్ని అందించారు.
Latest News