|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 02:48 PM
ప్రముఖ నటి, గాయని సులక్షణ పండిట్ (71) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె చనిపోవడానికి గల కారణం ఇంకా వెల్లడికాలేదు. 1970–80 టైంలో పలు ప్రముఖ చిత్రాల్లో నటించిన సులక్షణ.. ఉల్ఝన్, హేరా ఫెరీ, అప్నపన్, ఖందాన్, వక్త్ కీ దీవార్ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. సంగీత నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన ఆమె ప్రముఖ సంగీత దర్శకులు జతిన్–లలిత్ సోదరి. ఆమె మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Latest News