|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 05:16 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' విడుదలకు సిద్ధమైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A సర్టిఫికెట్ పొందింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "'ది గర్ల్‌ఫ్రెండ్'కు U/A సర్టిఫికెట్ వచ్చింది. తీవ్రమైన డ్రామా, అందరికీ కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు, అద్భుతమైన నటనను రేపు వెండితెరపై చూడండి" అని పేర్కొంది. ఈ చిత్రంలో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటించారు.
Latest News