|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 08:13 PM
కోలీవుడ్ యువ నటుడు కవిన్ ఇటీవల ఫాంటసీ రొమాంటిక్ కామెడీ 'కిస్' లో కనిపించాడు. సతీష్ కృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 7 నుండి జీ5లో తమిళ ఆడియోలో ప్రసారానికి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి డబ్బింగ్ వెర్షన్ల గురించి సమాచారం లేదు. ఈ చిత్రంలో ప్రీతి అస్రానీ కథానాయికగా నటించింది. RJ విజయ్, VTV గణేష్, ప్రభు మరియు రావు రమేష్ సహాయక పాత్రలు పోషించారు. రోమియో పిక్చర్స్‌కు చెందిన రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ స్వరాలు సమకూర్చారు.
Latest News