|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 07:26 PM
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' ఇటీవలే విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి బుక్ మై షోలో 100K+ టికెట్స్ అమ్ముడయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాతో ప్రముఖ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అయ్యారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నరేష్, నవీన్ చంద్ర, హిమజ, ప్రవీణ్, ఆది కీలక పాత్రలో నటిస్తున్నారు. రవితేజ ఈ చిత్రంలో స్ట్రిక్ట్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. భీమ్స్ సెసిరోలియో ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News