|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 05:07 PM
దిలీప్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందిన సినిమానే 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'.ఈ ఏడాది మే 9వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. దర్శకుడిగా బింటో స్టీఫెన్ కి ఇది మొదటి సినిమా. ఈ సినిమాతోనే కథానాయికగా 'రానియా రాణా' పరిచయమైంది. జూన్ లోనే ఓటీటీకి వచ్చేసిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
కథ: ప్రిన్స్ (దిలీప్) మధ్యతరగతి కుటుంబీకుడు. తల్లీ .. తండ్రి .. ఇద్దరు తమ్ముళ్లు. ఇదే అతని కుటుంబం. అయితే కుటుంబ బాధ్యతల కారణంగా అతని కంటే ముందుగానే ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లి జరిగిపోతుంది. తమ్ముళ్లకు ఉద్యోగాలు లేకపోవడంతో వాళ్ల కుటుంబాలను కూడా ప్రిన్స్ పోషిస్తూ ఉంటాడు. అందుకోసం అతను 'బొటిక్' నడుపుతూ కష్టపడుతూ ఉంటాడు. బొటిక్ కి సంబంధించిన వ్యవహారాలను అతని స్నేహితుడు కేకే చూసుకుంటూ ఉంటాడు. తన గురించి .. తన వాళ్ల గురించి .. ముఖ్యంగా తన కుటుంబ పరువు ప్రతిష్ఠలను గురించి ఆలోచించే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ప్రిన్స్ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి సింధు (రానియా రాణా) తారసపడుతుంది. ఆమె అందం .. చలాకీదనం తనకి బాగా నచ్చుతాయి. కాస్త ముదిరిపోయిన తనలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఆమె అంగీకరించడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సింధుతో పెళ్లికి సమయం దగ్గర పడుతూ ఉన్న సమయంలోనే, ఆమె యూట్యూబర్ అనే విషయం ప్రిన్స్ కి తెలుస్తుంది. అయితే ఈ రోజులలో అది కామన్ అనుకుని అతను సరిపెట్టుకుంటాడు. గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ప్రిన్స్ జీవితంలోకి భార్యగా సింధు అడుగుపెడుతుంది. యూ ట్యూబ్ వీడియోస్ .. సబ్ స్క్రైబర్లు .. లైకులు .. వ్యూస్ అంటూ ఆమె చేసే హడావిడి ప్రిన్స్ ను ఎలా ఇబ్బంది పెడుతుంది? అప్పుడతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ.
Latest News