|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 03:31 PM
హిందీ సీరియల్ ద్వారా వచ్చి తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన మృణాల్ 'సీతారామం'తో హీరోయిన్‌గా మారిపోయింది. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన సంప్రదాయ లుక్‌లో కనిపించి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.మొదటి మూవీతోనే హిట్ రావడంతో మృణాల్ రేంజ్ మారిపోయింది. ఈక్రమంలోనే వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతోంది. ప్రస్తుతం మృణాల్, వరుణ్ ధావన్ , పూజా హెగ్డే ఓ సినిమా చేస్తున్నారు.'హై జవానీ తో హై ఇష్క్ హోనా హై' టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తుండగా.. రమేష్ తరణి నిర్మిస్తున్నారు. కామెడీ అండ్ రొమాంటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు సమాచారం. తాజాగా, ఈ విషయంపై మృణాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. 'హై జవానీ తో హై ఇష్క్ హోనా హై' సినిమా జూన్ 5న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ.. డ్రామాతో పాటు కామెడీ కూడా కావాలని రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Latest News