|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 02:41 PM
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన 'కన్నప్ప' జూన్ 27, 2025 బహుళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ ఛానల్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జెమినీ టీవీ ఛానల్ లో అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం తొలి టెలికాస్ట్ లో 4.89 టీఆర్పీని నమోదు చేసినట్లు సామాచారం. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కజల్ అగర్వాల్, శరాత్ కుమార్, మరియు మధుబాల, ముఖేష్ రిషి, శరత్‌కుమార్, బ్రహ్మానందం, రఘుబాబు, మధు, ఐశ్వర్య భాస్కరన్, సప్తగిరి, సంపత్, దేవరాజ్, శివ బాలాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను విష్ణు మంచు తన అవా ఎంటర్టైన్మెంట్ కింద మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు పై నిర్మించారు. ఈ చిత్ర సంగీతాన్ని స్టీఫెన్ దేవాస్సీ మరియు మణి శర్మ స్వరపరిచారు.
Latest News