|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 02:56 PM
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 36వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా అయిన ఈ చిత్రానికి అధికారికంగా 'బైకర్' అని టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ గ్లింప్సె ని డిజిటల్ గా నవంబర్ 1న సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ గ్లింప్సె రేపు థియేటర్స్ లో ప్లే కానున్నట్లు కూడా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా మాళవిక నాయర్ నటిస్తుంది. డాక్టర్ రాజశేఖర్ శర్వానంద్ తండ్రిగా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వంశీకృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
Latest News