|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 02:39 PM
నితిన్, భారత్ దర్శకత్వంలో ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నటించిన 'అక్కడ అమ్మాయి ఇక్కాడ అబ్బాయి' చిత్రం ఇటీవలే విడుదల అయ్యి మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ చిత్రంలో ప్రదీప్ కి జోడిగా దీపికా పిల్లి నటించింది. ఈ చిత్రంలో గెటప్ శ్రీను, సత్య, వెన్నెలా కిషోర్, బ్రహ్మానందం, రోహిణి, రజిని, ఝాన్సీ, మరియు మురరాధర్ గౌడ్ కీలక పాత్రల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ లో ప్రసారానికి అందుబాటులోకి ఉంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని ఈటీవీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈటీవీ తెలుగు ఛానల్ లో అక్టోబర్ 20న మధ్యాహ్నం 1 గంటకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తొలి టెలికాస్ట్ లోనే 2.08 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. రాధాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి సందీప్ బొల్లా కథ, మాటలు రాశారు. ఈ చిత్రాన్ని మొంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ ఆధ్వర్యంలో నిర్మించారు.
Latest News