|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 08:31 AM
టాలీవుడ్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అశ్వినీదత్ కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానం ఉంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'చూడాలని ఉంది', 'ఇంద్ర' వంటి సినిమాలు అప్పట్లో టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి. తాజాగా ఇప్పుడు ఇంద్ర సినిమా నవంబర్ 2న ఉదయం 9 గంటలకి జీ తెలుగు ఛానల్ లో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవటానికి సిద్ధంగా ఉంది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2002లో జూలై 24న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమా ఇంద్ర. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆర్తీ అగర్వాల్, ముఖేష్ రిషి, సునీల్, వేణు మాధవ్, బ్రహ్మానందం మరియు ఇతరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి VSR స్వామి సినిమాటోగ్రఫీ అందించగా, మణి శర్మ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు.
Latest News