![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 09:27 AM
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం 'హరిహర వీరమల్లు'పై ప్రశంసల వర్షం కురిపించారు. నేడు విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన ఆయన, సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని, అభిప్రాయాన్ని పంచుకున్నారు."వాట్ యాన్ ఎలక్ట్రిఫయింగ్ ట్రైలర్!!" అంటూ తన పోస్ట్‌ను ప్రారంభించిన చిరంజీవి, తమ్ముడిని వెండితెరపై చూసి మురిసిపోయారు. "దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కల్యాణ్ బాబు వెండితెరపై నిప్పులు చెరగడం చూడటం ఎంతో ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఎనర్జీకి, ట్రైలర్‌లోని అద్భుతమైన విజువల్స్‌కు ఆయన ఫిదా అయ్యారు.ఈ సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్ర బృందం మొత్తానికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, నటీనటులు బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్‌లను ట్యాగ్ చేస్తూ తన అభినందనలు తెలియజేశారు.పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి నుంచి వచ్చిన ఈ ప్రశంసతో మెగా అభిమానుల్లో, సినీ వర్గాల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News