|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:10 PM
ప్రముఖ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సన్‌బర్న్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్తుండగా నోరా ఫతేహి కారు ప్రమాదానికి గురైంది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తి ఆమె కారును ఢీకొట్టాడు. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆమెకు తీవ్రమైన గాయాలేవీ కాలేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు ధ్రువీకరించారు.ప్రమాదం అనంతరం నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. "నేనొక తీవ్రమైన కారు ప్రమాదానికి గురయ్యాను. తాగి నడుపుతున్న వ్యక్తి నా కారును ఢీకొట్టాడు. ఆ దెబ్బకు నేను కారులో అటు ఇటు పడిపోయాను. నా తల కిటికీకి బలంగా తగిలింది" అని ఆమె వివరించారు. ఈ ఘటన చాలా భయంకరంగా, బాధాకరంగా అనిపించిందని, తన ప్రాణాలు కళ్ల ముందే కదిలినట్లు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు స్వల్ప గాయాలు, వాపులు ఉన్నాయని, కొంతకాలం నొప్పితో బాధపడాల్సిందేనని తెలిపారు. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
Latest News