|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 08:14 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి రాశీ ఖన్నా, తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బీటీఎస్ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోలను షేర్ చేసిన రాశీ ఖన్నా, యాక్షన్ మరియు కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది. కొన్నిసార్లు నవ్వులు కూడా ఉంటాయి అంటూ దర్శకుడు హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియోలను చూస్తే, ఆమె షూటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.గతంలో కూడా పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని రాశీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయనతో దిగిన ఒక సెల్ఫీని పంచుకుంటూ, ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అని ఆమె తెలిపారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో రాశీ 'శ్లోక' అనే ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల మరో కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు పార్తిబన్, కేఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, గౌతమి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో హరీశ్ శంకర్‌తో 'హైపర్', 'బెంగాల్ టైగర్' వంటి చిత్రాల్లో పనిచేసిన రాశీకి, పవన్ కల్యాణ్‌తో ఇది మొదటి సినిమా కావడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు నెలకొన్నాయి.
Latest News