|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:11 PM
హీరో రోషన్ తన కెరీర్ గురించి, వ్యక్తిగత లక్ష్యాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను మొదట నటుడు కావాలనుకోలేదని, ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా స్థిరపడాలనేది తన తొలి కల అని ఆయన వెల్లడించారు. తన తండ్రి కోరిక కూడా అదేనని, అయితే సినిమాలపై ఉన్న ఆసక్తి తనను నటన వైపు నడిపించిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘ఛాంపియన్’ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా అవకాశం గురించి రోషన్ మాట్లాడుతూ, “నిర్మాత దత్తు గారు ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. అలాంటి నిర్మాత నాకు ఇంత గ్రాండ్‌గా ‘ఛాంపియన్’ సినిమా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. స్వప్న అక్క, ప్రియాంక అక్క, దత్తు గారు అందరూ నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు” అని అన్నారు.భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరిస్తూ, “ఇకపై కెరీర్‌లో ఎక్కువ విరామం తీసుకోవాలనుకోవడం లేదు. కనీసం రెండేళ్లకు మూడు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను” అని రోషన్ స్పష్టం చేశారు. తన తండ్రి కోరిక మేరకు క్రికెటర్‌గా మారాలనుకున్నప్పటికీ, చివరికి నటననే తన మార్గంగా ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Latest News