|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 11:53 AM
బాలీవుడ్ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన 'హోమ్‌బౌండ్' చిత్రం 2026లో జరగనున్న 98వ అకాడమీ అవార్డుల రేసులో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' విభాగంలో షార్ట్‌లిస్ట్ అయ్యింది. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా నటించిన ఈ సినిమా, మైనారిటీ, తక్కువ కులానికి చెందిన ఇద్దరు స్నేహితులు పోలీసు అధికారులు కావాలని కలలు కంటూ, వివక్షను ఎదుర్కొనే కథను చెబుతుంది. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Latest News