|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 12:39 PM
అక్కినేని నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ కు పరిచయం అక్కర్లేదు. వీరిద్దరు కొద్దికాలం పాటు డేటింగ్ చేసి తర్వాత ఒకటయ్యారు.ముందుగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చారు. కానీ పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత చైతు 'తండేల్'లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం 'NC-24' మూవీతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక శోభిత విషయానికొస్తే.. పెళ్లి తర్వాత సినిమాలు చేయనప్పటికీ ఊహించని విధంగా ఫేమ్ రాబట్టుకుంది. ఇక అప్పటినుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది.చాలా రోజుల తర్వాత మళ్లీ డబ్బింగ్ స్టూడియోలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఏం సినిమానో వెల్లడించలేదు. ఈక్రమంలో తాజాగా, శోభిత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇందులో ఓ నిర్మానుష్య ప్రాంతంలో గరిట పట్టుకున్న అక్కినేని కోడలు పప్పు చారు కలుపుతూ, బెండకాయలు కట్ చేస్తూ కనిపించింది. అలాగే కొబ్బరికాయను పట్టుకుని కోపంగా కొడుతున్న స్టిల్ ఇచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నాగచైతన్య నువ్వు చేసిన వంట రుచి చూడటానికి సిద్ధంగా ఉన్నా అని కామెంట్ పెట్టగా.. నెటిజన్లు మాత్రం అవి నువ్వు చేయకున్నా ఫొటోలు దిగి షో చేయకని ట్రోల్ చేస్తున్నారు. అలాగే మరికొందరు శోభితను మెచ్చుకుంటున్నారు.
Latest News