|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 02:23 PM
స్టార్ హీరోయిన్ ఇలియానా, 'దేవదాస్'తో 2006లో వెండితెరకు పరిచయమై, టాలీవుడ్‌లో ప్రభాస్, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో నటించారు. ప్రస్తుతం తల్లిగా సమయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, వెండితెరను మిస్ అవుతున్నానని తెలిపారు. త్వరలోనే మళ్లీ సినిమాల్లో కనిపిస్తానని చెప్పారు. దీంతో ఇలియానా మళ్లీ తెరపై కనిపించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. చివరిసారి 2018లో 'అమర్ అక్బర్ ఆంటోనీ'లో నటించారు.
Latest News