|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 09:41 PM
మెగాస్టార్ చిరంజీవి వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వసిష్ఠ దర్శకత్వంలో రూపొందిన "విశ్వంభర" ఇప్పటికే పూర్తయింది. ఇక మరోవైపు, హిట్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి "మన శంకరవరప్రసాద్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతోంది. 2026 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.ఇదిలా ఉండగా, చిరు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వాల్తేరు వీరయ్య వంటి భారీ హిట్ ఇచ్చిన బాబీ (KS Ravindra) దర్శకత్వంలో చిరంజీవి నటించనున్న మరో సినిమా లైన్‌లో ఉంది.ఈరోజు (ఆగస్టు 22), చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నెత్తురు తడిసిన గొడ్డలిని చూపించడంతో, ఇది యాక్షన్ థ్రిల్లర్ అనే ఊహనలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమాగా తెరకెక్కుతోంది.ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. సెప్టెంబర్లో సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు సినిమాటోగ్రాఫర్‌గా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని వ్యవహరించనున్నారు. హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారు? ఇతర కీలక పాత్రల్లో ఎవరు ఉన్నారు? అనే వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఇక గతంలో చిరు-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. అందుకే ఈ కొత్త సినిమాపై అభిమానుల్లో మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Latest News