|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 01:46 PM
అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్ర రావు, శ్రీలీల అమెరికాలో నిర్వహించిన నాట్స్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అమెరికాలో ఇంత మంది తెలుగు వాళ్లం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కు నన్ను పిలిచినందుకు మీ అందరికీ థాంక్స్. తెలుగు వారంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్. అదే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది. నాట్స్ గురించి ఓ మాట చెబుతా. నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్ నేషనల్. మన తెలుగు కల్చర్ ను ముందు తరాలకు తీసుకెళ్తున్న నాట్స్ కు చాలా స్పెషల్ థాంక్స్ చెబుతున్నా. ఎక్కడున్నా సరే ఇండియన్స్ తగ్గేదేలే.. తెలుగు వారు అస్సలు తగ్గేదే లే అంటూ హుషారెత్తించాడు బన్నీ. డైరెక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతోంది. ఇక్కడ నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఉండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు వారందరినీ అమెరికాలో ఇలా ఒకేచోట చూడటం ఆనందంగా ఉంది. సుకుమార్ కు నాకు ఒకటే తేడా. ఆయనకు గడ్డం ఉంటుంది.. నాకు ఉండదు. నేను అడవిరాముడిలో అడివిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ ను అయ్యాను. ఆయన పుష్పలో అడివిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బన్నీని స్టార్ ను చేశాడు అంటూ చెప్పాడు రాఘవేంద్రరావు. సుకుమార్ మాట్లాడుతూ.. అమెరికాలో నా సినిమాలను ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ స్పెషల్ థాంక్స్. వన్ నేనొక్కడినే మూవీని ఇక్కడ చాలా ఆదరించారు. అందువల్లే నాకు వేరే సినిమా ఛాన్స్ వచ్చింది. నవీన్ ఎర్నేనిని మాకు ప్రొడ్యూసర్ గా ఇచ్చినందుకు మీ అందరికీ స్పెషల్ థాంక్స్. మైత్రీ మూవీ మేకర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నాట్స్ ప్రోగ్రామ్ కు రావడం ఒక రకంగా గర్వంగా ఉంది. మీ అందరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ తెలిపాడు
Latest News