|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 01:31 PM
జబర్థస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీపై వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా ఏపీ రాజకీయాలపై తనదైనశైలిలో స్పందించారు.ఈ సందర్భంగా సినిమా వాళ్లకు, టీవీ ఆర్టిస్టులకు తాను చేసిన సాయం గురించి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులు తనతో చాలా సన్నిహితంగా ఉంటారని.. వారిని కూడా సొంత మనుషుల్లానే చూసుకుంటానని రోజా చెప్పుకొచ్చారు. వారు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని అడిగిన వెంటనే తానే స్వయంగా దగ్గరుండి దర్శనం చేయించిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శనం టికెట్లు అమ్ముకున్నారని తనపై వచ్చిన ఆరోపణలను రోజా ఖండిస్తూనే.. ఎవరి దగ్గరైనా తను ఒక్క రూపాయి తీసుకున్నామేమో అడగమని రోజా ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు.తనను సాయం చేయమని కోరి వచ్చిన వారిని ఎప్పుడై నిరాశపర్చలేదని వివరించిన రోజా... చిన్నవారైనా పెద్దవారైనా సరే తానే వెళ్లి దర్శనం చేయించినట్లు వెల్లడించారు. తన పనులన్నీ వదులుకొని దగ్గరుండి దేవుడి దర్శనం చేయిస్తానని ఆమె చెప్పారు.సాధారణంగా నాయకులు ఇలాంటి పనులు పీఏలకు అప్పజెప్తుంటారని.. కానీ తాను అలా కాదని దగ్గరుండి దర్శనం చేయించి భోజనం పెట్టించి మరీ పంపుతానని స్పష్టం చేశారు. ఆర్పీకి దేవుడే బుద్ధి చెప్తాడు "ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏదైనా ఉంటే మా పీఏకి చెప్తాను మీరు ఫాలో అప్ చేసుకోండి అంటారు. కానీ నా స్వభావం అలాంటిది కాదని,నా ఫోన్ ఎప్పుడూ నా చేతిలో ఉంటుంది, నేను పీఏకి ఇవ్వను, ఎవరికి ఏ సాయం కావాలన్న కూడా నేను స్పందిస్తాను" అని రోజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కొంతమంది ఆర్టిస్టులకు నేనే స్వయంగా రూమ్స్ తీయించి, నేరుగా దర్శనానికి తీసుకువెళ్లానని, మళ్లీ రూమ్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లే వరకు తానే దగ్గరుండి చూసుకున్నానని రోజా తెలిపారు.నా దగ్గర అంత కంఫర్ట్‌గా ఆర్టిస్టులు ఫీల్ అవుతుంటారని రోజా చెప్పారు. అలా చూసినోడే ఈరోజు ఒకడు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడని రోజా కిర్రాక్ ఆర్పీ గురించి పరోక్షంగా స్పందించారు. "వాడికి ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ అనేది ఇస్తాడని,ఎందుకంటే జబర్దస్త్‌లో ఆల్మోస్ట్ అందరూ దర్శనాలకి వచ్చినవాళ్ళే, మా ఇంటికి వచ్చినవాళ్ళే. అందరికీ కృతజ్ఞత ఉంది, కానీ ఒకడికి తప్ప" అంటూ కిర్రాక్ ఆర్పీపై పరోక్ష విమర్శలు చేశారు.రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆమె చేతుల మీదగానే తన చేపల కర్రీ పాయింట్‌ను ఓపెన్ చేయించాడు ఆర్పీ. ఆ తర్వాత ఆమెపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆమెపై పరుష పదజాలంతో కిర్రాక్ ఆర్పీ విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు దానికి కౌంటర్‌గానే రోజా స్పందించడం జరిగింది. ఇలాంటి వాళ్లకు దేవుడే బుద్ది చెబుతాడని రోజా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మూడు కంపెనీలు ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏపీలో సంక్షేమాన్ని గాలికొదిలేశారని అభివృద్ధిని అటకెక్కించారని రోజా ఫైర్ అయ్యారు. మూడు పెద్ద కంపెనీలు ఏపీ రాష్ట్రానికి వచ్చాయని అందులో ఒకటి హెయిర్ కటింగ్ సెలూన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించగా.. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి చెప్పులు షాపు ఓపెన్ చేశారని, మరొకటి కర్నూలులో వైన్ మార్ట్‌ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారని సెటైర్ వేశారు.
Latest News