|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 10:53 AM
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా షూటింగ్ సమయంలో రామ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఆఫ్ స్క్రీన్ ప్రేమ మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతానని, రిలేషన్ షిప్స్ విషయంలో ఎప్పుడూ పర్సనల్ గానే ఉంటానని సమాధానమిచ్చాడు. అయితే భాగ్యశ్రీ కేవలం హీరోయిన్ మాత్రమేనా ఇంకేమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు రామ్ నవ్వుతూ సమాధానం దాటవేశాడు. దీంతో ఆల్మోస్ట్ లవ్ కన్ఫర్మ్ అయ్యిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Latest News