|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 05:24 PM
టాలీవుడ్‌లో వారసత్వం గురించి ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. స్టార్ హీరోల కొడుకులు హీరోలుగానే అరంగేట్రం చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ భూపతిరాజు మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తండ్రిలా వెండితెరపై హీరోగా వెలిగిపోవాలని కాకుండా, తెరవెనుక ఉండి కథను నడిపించే దర్శకుడిగా మారేందుకు తొలి అడుగులు వేస్తున్నాడు.ప్రస్తుతం మహాధన్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి, ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా (సూర్య 46) కోసం మహాధన్ దర్శకత్వ విభాగంలో చేరినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణంపై ఆసక్తితో, ఎంతో ఇష్టపడి తానే వెంకీ అట్లూరి బృందంలో చేరాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Latest News