|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 05:22 PM
‘మౌనరాగం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రియాంక జైన్, తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే దిశగా కీలక అడుగు వేశారు. పెళ్లికి ముందే ఈ జంట ఏకంగా కోటి రూపాయల లోన్ తీసుకుని తమ కలల ఇంటిని నిర్మించుకుంటోంది. ఈ విషయాన్ని ప్రియాంక స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తమ ఇంటి వీడియోను షేర్ చేస్తూ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.గత ఏడాది కొనుగోలు చేసిన స్థలంలో తాము ఇల్లు కట్టుకుంటున్నట్లు ప్రియాంక తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘కోటి రూపాయల లోన్‌తో ఇల్లు కట్టుకుంటున్నాము. ఇది కేవలం ఇటుకలతో కాదు.. ఎన్నో ఆశలతో, కలలతో నిర్మితమవుతోన్న ఇల్లు. ఇక్కడ కేవలం ఇంటికి పునాది పడలేదు, జీవితకాల జ్ఞాపకాల సమాహారానికి పునాది పడింది. ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇది మా శాశ్వత నివాసం’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రియుడు శివకుమార్‌తో కలిసి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.గత కొంతకాలంగా ప్రియాంక, శివకుమార్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్న ఈ జంట, సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఇంటి నిర్మాణంపైనే పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Latest News