|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 05:24 PM
విజయవాడలో 1988లో జరిగిన కుల ఘర్షణలు తమ కుటుంబంలో పెను మార్పులకు కారణమయ్యాయని హీరో రామ్ పోతినేని తెలిపారు. ఆ ఘర్షణల కారణంగా ఒక్క రాత్రిలో తమ కుంటుంబం సర్వం కోల్పోయిందని చెప్పారు. ఈ మేరకు జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షో లో పాల్గొన్న రామ్ పోతినేని తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు.మా తల్లిగారిది హైదరాబాద్ కావడంతో తాను పుట్టింది ఇక్కడేనని రామ్ చెప్పారు. తర్వాత తమ కుటుంబం విజయవాడ వెళ్లిందని వివరించారు. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయని, ఆ ఘర్షణల్లో తమ కుటుంబం అప్పటివరకు సంపాదించిందంతా కోల్పోయిందని తెలిపారు. దీంతో తన తండ్రి కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారని చెప్పారు. చెన్నైలో తన తండ్రి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారని వివరించారు.విజయవాడలో ఉన్నప్పుడు తమ ఇంట్లో తన బొమ్మల కోసమే ప్రత్యేకంగా ఓ పెద్ద గది ఉండేదని, చెన్నైకి వెళ్లాక ఆ బొమ్మల గదిలో సగం కూడా లేని ఇంట్లో ఉండాల్సి వచ్చిందని రామ్ చెప్పారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చాక మొత్తం కోల్పోవడం చాలా బాధాకరమని రామ్ పోతినేని చెప్పారు. అయినా తన తండ్రి నిరాశ చెందకుండా, ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తన తండ్రి అంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు.
Latest News