|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 03:18 PM
సినీ నటి ఆయేషా ఖాన్ తన చిన్నతనం నుంచే లైంగిక వేధింపులకు గురయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నాన్న స్నేహితుడైన ఒక వ్యక్తి తన వక్షోజాల గురించి అసభ్యంగా మాట్లాడాడని, తనను చెడు దృష్టితో చూసేవాడని ఆమె తెలిపారు. తన వాళ్ళే తనను వేధించారని, సినీ పరిశ్రమలో కూడా ఇలాంటివి సర్వసాధారణమని ఆమె పేర్కొన్నారు. 'ముఖచిత్రం' సినిమాతో తెలుగులో పరిచయమైన ఆమె, ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Latest News