|
|
by Suryaa Desk | Mon, Sep 08, 2025, 09:14 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కిష్కింధపురి' చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సినిమా హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి తెలిపారు.విలేకరుల సమావేశంలో కౌశిక్ మాట్లాడుతూ.. తన తొలి చిత్రం 'చావు కబురు చల్లగా' తర్వాత గీత ఆర్ట్స్‌లోనే మరో సినిమా చేయాలని అనుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో నిర్మాత సాహు గారపాటికి ఈ కథ చెప్పగా, ఆయనకు బాగా నచ్చిందని, తర్వాత సాయి శ్రీనివాస్‌కు కథ నచ్చడంతో ప్రాజెక్టు మొదలుపెట్టామని వివరించారు.'కిష్కింధపురి' టైటిల్‌కు రామాయణం స్ఫూర్తి అని, ఈ కథ రామాయణంలోని అంశాలను మెటాఫరికల్‌గా తీసుకుందని దర్శకుడు తెలిపారు. సినిమాలోని పాత్రలను తాను చూసిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా సృష్టించానని, అవి ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తాయని అన్నారు.సినిమా కథ 1989లో మొదలవుతుందని, దీనికోసం ఒక రేడియో స్టేషన్ సెట్‌ను చాలా వింటేజ్ వైబ్‌తో నిర్మించామని కౌశిక్ చెప్పారు. సినిమా నిండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, ఇది ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అన్నారు. నిర్మాత సాహు గారపాటి ఎక్కడా రాజీ పడకుండా, సినిమాకు కావాల్సిన ప్రతిదాన్నీ సమకA' సర్టిఫికేట్ ఇచ్చిందని కౌశిక్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ మూడు అద్భుతమైన పాటలతో పాటు, నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు.సాయి శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'రాక్షసుడు' సినిమా పెద్ద హిట్ అయిన నేపథ్యంలో, ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. సాంకేతిక విలువలు, గ్రాఫిక్స్ చాలా ఉన్నతంగా వచ్చాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని, 'కిష్కింధపురి' విడుదల తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Latest News