|
|
by Suryaa Desk | Mon, Sep 08, 2025, 09:13 PM
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. బసవతారకం ఆసుపత్రి ప్రముఖులతో కలిసి ఆయన సోమవారం ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్(ఎన్ఎస్ఈ)ను సందర్శించారు. ఈ నేపథ్యంలో అధికారుల విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గంటను మోగించారు. దీంతో ఎన్ఎస్ఈ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా బాలయ్య నిలిచారు. కాగా ఇటీవలే ఆయనకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కిన విషయం తెలిసిందే.
Latest News