|
|
by Suryaa Desk | Mon, Sep 08, 2025, 09:14 AM
రాఘవ లారెన్స్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తీవ్ర పేదరికంలో అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న శ్వేత అనే దివ్యాంగురాలికి సొంత ఇల్లు కట్టించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆమెకు అండగా నిలిచిన లారెన్స్, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.శ్వేత దీనస్థితి గురించి తెలుసుకున్న లారెన్స్, తొలుత ఆమె ప్రయాణ అవసరాల కోసం ఒక వీల్‌చైర్ స్కూటీని బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తిరిగి నడవడానికి అవసరమైన వైద్య సహాయం అందించి, కృత్రిమ కాలును కూడా ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఆమెకు సురక్షితమైన నివాసం కల్పించాలనే ఉద్దేశంతో మరో ముందడుగు వేశారు. "శ్వేతకు ఒక సురక్షితమైన గృహం అవసరం. ఆమెకు సొంతిల్లు కట్టించడమే నా తదుపరి లక్ష్యం" అని లారెన్స్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వార్త తెలియగానే నెటిజన్లు ‘హ్యాట్సాఫ్ లారెన్స్ అన్నా’ అంటూ అభినందనలు కురిపిస్తున్నారు.
Latest News