|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 05:03 PM
టాలీవుడ్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై మెగాస్టార్ చిరంజీవితో నిర్మాత సి.కల్యాణ్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేనెప్పుడూ ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, నిర్మాతలు బాగుండాలని కోరుకుంటా. నా వంతుగా కార్మికులతోనూ మాట్లాడతా’’ అని చిరంజీవి అన్నారని కల్యాణ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం లోగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు.
Latest News